Tuesday, January 20, 2015

పక పకా పొట్ట చెక్కలయ్యేలా నవ్విన ఒక సంఘటన

నా స్నేహితుడు తో (పేరు అవసరం లేదనుకుంట) కుర్చుని కారప్పూస కబుర్లు చెప్పుకుంటున్నాను.
మాటల్లో మందు Matter వచ్చింది.
"మందు మహా చెడ్డదిరా" అన్నాడు మా వాడు ఒక జుగుప్సాకరమైన Expression తో.
"పుసుక్కున అంత మాట అనేసావెoట్రా" అన్నాను నేను.
"మా బావ తెలుసు కద రా (వీడి పేరు కూడా అవసరం లేదు)....వాడి జీవితం లో మరిచిపోలేని ఒక తీపి జ్ఞాపకాన్ని ఇచ్చింది రా ఈ మందు" అన్నాడు.
అసలేమైందో ముందు చెప్పి తగలేడు రా అరబ్బీ ఒంటె మొకపోడా అని కసురుకున్నా నేను
జరిగిన కథ ఇలా చెప్పాడు :
మా బావ Modern దేవదాసు అన్న విషయం నీకు తెలుసు కదా.  ఒకసారి మా బావ ని మా ఉడతలు పట్టే gang మొత్తాన్ని ఇంట్లో ఎవరు లేని టైం లో మందు పార్టీ కి పిలిచాను. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆపాద మస్తకం మందు లో మునిగి తేలాము. అప్పుడు మా బావ Mummy  కాల్ చేసి... "నాన్న ఇంటికి రమ్మంటున్నాడు ఎక్కడ చచ్చావ్ తొందరగా వచ్చి చావురా గాడిద" అని అరిచింది. వీడికి వీళ్ళ నాన్న అంటే ఈ వయసు లో కూడా Shame Shame Puppy Shame ఏ....కంగారు కంగారు గా ఇంటికి బయలుదేరాడు. "వద్దు రా వెళ్ళకు" అని...వయసైపోయిన అవ్వ కి చెప్పినట్టు చెప్పా  ...."మనం ఎంత తాగిన Strong ఏ రా కుయ్యా" అని అతి నమ్మకం తో ఎల్లిపోయాడు బిడ్డ.
ఇంటికి వెళ్ళగానే సరాసరి కుర్చుని "అమ్మా అన్నం పెట్టు ఆకలేస్తుంది" అని అరిచాడట....అమ్మ వంటింట్లో నుండి హాల్ లోకి వచ్చి వాడికెల్లి బిత్తరపోయి చూసి ఆశ్చర్యపాయింది. కళ్ళు తుడుచుకుంటూ ఎంటమ్మా అల చూస్తావ్ జల్ది తిస్కరా పో అని అరిచాడు వీడు....వెనక నుండి ఒక Strong Powerful Blow ఒకటి వీడి నెత్తికి తాకింది....ఆ దెబ్బకి ఒక angle లో కూర్చున్న వీడు రెండు గజాలు ప్రయాణం చేసి ముందుకి పడ్డాడు.....తీరా చుస్తే వాడు కూర్చుంది ఎక్కడయ్యా అంటే వాళ్ళ నాన్న ఒళ్లో.....కనీసం గుడ్డు ని కూడా ఇంట్లోకి రానివ్వని బ్రామ్హణ కుటుంబం అది...తాగుబోతు కొడుకు ని ఎలా బాదారో మీరే ఊహించుకోండి.


తాగితే తాగారు "Jai Chiranjeeva" లో చిరు ని follow ఐపొండి....ఇంటికి ఎల్లమాకండి ఎల్లినా నాన్న ఒళ్లో అసలు కుర్చోమాకండి.....!!!!

No comments:

Post a Comment